Hyderabad: గండిపేటలో హెరాయిన్ పట్టివేత: ఒకరి అరెస్ట్!

Hyderabad: గండిపేట్ నార్సింగి ప్రాంతంలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ జరిపిన తనిఖీల్లో 15.49 గ్రాముల హెరాయిన్ పట్టుబడింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Arun Goud, Hyderabad
Published on: 8 Oct 2026 7:50 PM IST
Hyderabad
X

Hyderabad: గండిపేటలో హెరాయిన్ పట్టివేత: ఒకరి అరెస్ట్!

హైదరాబాద్: గండిపేట్ నర్సింగ్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపు తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీటీం సీఐ గణపతిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెస్టు బెంగాల్‌కు చెందిన లేబర్ సుజిత్ (32) అనే వ్యక్తి వద్ద 15.49 హెరాయిన్ పట్టుబడింది.

నిందితుడికి ఎండీ అనురుల్ అనే వ్యక్తి సరఫరా చేశాడనే సమాచారం మేరకు ఆతడిపై కూడ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని, హెరాయిన్‌ను గండిపేట్ ఎక్సైజ్ స్టేషన్ల లో అప్పగించారు. పట్టుకున్న హెరాయ ఇన్ విలువ రూ.45 వేలుగా ఉంటుందని అంచనా వేశారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad