Hyderabad: కూలీ పనుల కోసం వచ్చి.. గంజాయి దందా చేస్తూ కటకటాల్లోకి!

Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో 14.77 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు.

Akhil Harsha
Published on: 1 Aug 2026 5:49 PM IST
Hyderabad
X

Hyderabad: కూలీ పనుల కోసం వచ్చి.. గంజాయి దందా చేస్తూ కటకటాల్లోకి!

హైదరాబాద్: బీహార్ పాట్నా ప్రాంతానికి చెందిన సన్నీ కుమార్(28) అనే వ్యక్తి కూలీ పనులు చేస్తు గంజాయి అమ్మకాలు ప్రారంభించాడు.

విశాఖపట్నం నుంచి 14.77 కేజీలను కొనుగోలు చేసుకొని తీసుకొని వచ్చి లింగంపల్లిలో దిగి చందనగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేపట్టడానికి వెలుతుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజ్ సిబ్బంది కలిసి చందనగర్‌లో గంజాయితోపాటు నిందితుడు సన్నీ కుమార్ ను పట్టుకున్నారు.

నిందితుడిని గంజాయిని ఎక్సైజ్ స్టేషన్ షేర్‌లింగంపల్లి లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ బీ టీమ్ లీడర్ ఫయాజోద్దీన్ తెలిపారు.పట్టుకున్న గంజాయి విలువ రూ. 7.50 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు.

Akhil Harsha

Akhil Harsha

Next Story