Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో ఎక్సైజ్ దాడులు.. గోవా మద్యం సీజ్!

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డుపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు. గోవా నుండి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 18 Jun 2026 12:44 PM IST
Shamshabad
X

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో ఎక్సైజ్ దాడులు.. గోవా మద్యం సీజ్!

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సుంకాన్ని తప్పించుకుని గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపును అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story