Tandur: హాజీపూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల కలకలం!
Tandur: వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల గుట్టు రట్టయింది.
Tandur: హాజీపూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల కలకలం!
Tandur: నకిలీ డీఏపీ (DAP) ఎరువులను విక్రయించడం రైతుల జీవితాలతో చెలగాటమాడటమే కాబట్టి, నకిలీలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి అన్నారు. గురువారం మండల పరిధిలోని హాజీపూర్ గ్రామంలో నమ్మదగిన సమాచారం మేరకు యాలాల పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా రాచూరి ఆశన్న, శంకిరి బిచ్చప్ప ఇండ్లలో నిల్వ ఉంచిన 43 బస్తాల నకిలీ డి ఏ పి పి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ...
ఇట్టి డి ఏ పి ని పెద్దేముల్ కు చెందిన పూల రాజు తండ్రి నర్సింలుకు అమ్మినట్లు తెలిసిందన్నారు. నకిలీ ఎరువుల ప్రభావం వల్ల ఆర్థిక మోసం జరుగుతుందన్నారు. తక్కువ ఖర్చుతో తయారైన నకిలీ బస్తాలను అధిక ధరలకు అమ్మి రైతులను మోసం చేస్తున్నారన్నారు.పొలంలో నకిలీ ఎరువులు వాడటం వల్ల పంట సరిగా పండక రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
నాణ్యత లేని రసాయనాలు భూమి యొక్కసారాన్ని దెబ్బతీస్తాయన్నారు. రైతులను నిండా ముంచే నకిలీ ఎరువుల ముఠాల మీద పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడే డీలర్ల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయడం జరుగుతుందన్నారు. మండల పోలీసులు నకిలీ డిఏపి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు .
మండల వ్యవసాయ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ విటల్ రెడ్డి తెలిపారు. నకిలీ డి ఏ పి ని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలన్నారు.




