Quthbullapur: నకిలీ క్లినిక్‌పై దాడి.. బోగస్ డాక్టర్ అరెస్ట్!
Quthbullapur: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో ఎస్వోటీ (SOT) మరియు స్థానిక పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో ఓ నకిలీ డాక్టర్ పట్టుబడ్డాడు.
Quthbullapur: నకిలీ క్లినిక్‌పై దాడి.. బోగస్ డాక్టర్ అరెస్ట్!
కుత్బుల్లాపూర్: ప్రజల ఆరోగ్యంతో చె లగాటమాడుతున్న నకిలీ వైద్యులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ పోలీసులతో కలిసి ఎస్వోటీ బృందం సూరారం పరిధిలోని వెంకటరామ నగర్లో బచ్పన్ స్కూల్ సమీపంలో నడుస్తున్న “రక్షిత క్లినిక్”పై ఆకస్మిక దాడి నిర్వహించింది.
దాడిలో క్లినిక్ను నిర్వహిస్తున్న సనాది కర్ణాకర్ (35)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ, ఎలాంటి వైద్య విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదా చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండానే డాక్టర్గా నటిస్తూ క్లినిక్ నడుపుతున్నట్లు విచా రణలో వెల్లడైంది. సుమారు ఏడాది కాలంగా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ రోగులను పరీక్షించి, మందులు ఇచ్చి కన్సల్టేషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో అతను వైద్య నైపుణ్యం లేకుండానే రోగులకు చికిత్స అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్లు తేలింది. దీంతో సూరారం పోలీసులు అతనిపై సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.
వైద్య సేవలు పొందే ముందు ఆయా వైద్యులకు చెల్లుబాటు అయ్యే అర్హతలు, రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉన్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు లేదా అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలనికోరారు. ప్రజల ప్రాణా లతో ఆటలాడే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగు తాయని పోలీసులు హెచ్చరించారు.




