Medchal: అమాయకుల కళ్లలో కారం చల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!
Medchal: మేడ్చల్ మండలం రావల్‌కోల్ అనుబంధ గ్రామం గూడెంగడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా 'ఎస్ ఆర్ వెంచర్' పేరిట ప్లాట్లు విక్రయించి కోట్లలో మోసం.
Medchal: అమాయకుల కళ్లలో కారం చల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!
మేడ్చల్: రూపాయి రూపాయి కూడబెట్టి భూమి తీసుకొని సొంత ఇళ్లు కట్టుకుందామనుకున్న వారీ కళ్లలో కారం చల్లాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి..హైదరాబాద్ చింతల్ కు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి అనుబంధ గ్రామమైన గూడెం గడ్డ తండాలో అనుమతులు లేకుండా ఎస్ ఆర్ వెంచర్ అనే పేరుతో వెంచర్ చేసి అమాయక ప్రజలను ప్లాట్లను విక్రయించాడు .ఎస్ ఆర్ వెంచర్ కు కనీసం ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయించడం ఈ వ్యాపారి ఆరితేరిన వాడని స్థానికులు చెబుతున్నారు.
కాళేశ్వరం కాలువలో వెంచర్ పోతుందని తెలిసి కూడా తమకు ప్లాట్లు అమ్మినాడని బాధితులు లబోదిబో మంటున్నారు.2019 లో కాళేశ్వరం కాలువలో వెంచర్ స్వాధీనము కొరకు ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసి కూడా 2020 లో హడావిడిగా ప్లాట్లను అమ్మినట్టు బాధితులు మీడియాకు వెల్లడించారు.
ఈ వెంచర్ లో ప్లాటు కొనుగోలు చేసిన 70 మందిలో సగానికి పైగా ప్లాట్లు కాళేశ్వరం కాలువలో పోయాయని వాపోతున్నారు.తమకు న్యాయం చేయాలని బాధితులు వ్యాపారి సుభాష్ రెడ్డిని నిలదీయడంతో తమకు అదే ప్రాంతంలో మరొక వెంచర్ చేసి ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చారు.2020 నుంచి గత ఆరు సంవత్సరాలుగా ఇవాళ,రేపు అని కాలం వెళ్లదీసుకుంటున్నాడని ఓపిక నశించిన బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.రియల్ వ్యాపారి సుభాష్ రెడ్డి పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం కాలువలో పోయిన భూమికి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారాన్ని సైతం సుభాష్ రెడ్డి తీసుకున్నాడని బాధితులు వాపోతున్నారు.ఇంతే కాకుండా ఈ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి గతంలో మేడ్చల్ మండలంలోని లింగాపూర్,మైసిరెడ్డి పల్లి,రావల్కోల్ గ్రామాల్లో వెంచర్లు చేసి అమాయక ప్రజలను మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారు.కాని ఇప్పుడు ఎస్ ఆర్ వెంచర్ నామరూపమే లేకుండాపోయిందని సమాచారం.ఇలాంటి వారిని నమ్మి ప్లాట్లను కొని మోసపోవద్దని బాధితులు వాపోతున్నారు....




