Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్‌లో ఘనంగా రైతు వారోత్సవాలు

Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ రైతు వేదికలో జరిగిన రైతు వారోత్సవాల్లో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR
Published on: 4 May 2026 7:45 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్‌లో ఘనంగా రైతు వారోత్సవాలు

Abdullapurmet: రైతు సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోంది…సిఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు..ప్రతి పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు రైతులకి అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి శనివారం వరకు రైతు వారం గా ప్రకటించడం జరిగింది

అందులో భాగంగా సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ రైతు వేదిక లో వ్యవసాయ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం దాదాపు 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు..రైతులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు..రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుందని అలాంటి పద్ధతులు పాటించాలని సూచించారు.కల్తీ విత్తనాలు అరికట్టామని..,మార్కెట్ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని…అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని తెలిపారు..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు…ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు…వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను తీసుకోవాలని కోరారు .

అనంతరం రైతు ప్రతిజ్ఞ నిర్వహించి భూసార పరీక్ష చేసుకున్న రైతులకు గుర్తింపు పత్రాలు అందజేశారు

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ CH,భాస్కర చారి….సర్పంచ్ లు మండుగుల విజయ శ్రీశైలం గౌడ్…కోట ప్రభాకర్ రెడ్డి…వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్) అధికారి పద్మజ,ADH అరుణ, మండల వ్యవసాయ అధికారి పల్లవి, వ్యవసాయ విస్తరణ అధికారి రఘు తో పాటు రైతులు ధర్మారెడ్డి బాల్ రెడ్డి జంగారెడ్డి మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story