LB Nagar: గ్లోబల్ ఐవీఎఫ్ సదస్సులో పరిశోధనలకు అంతర్జాతీయ అవార్డు!
LB Nagar: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా ఫెర్టీ9 ఎల్బీనగర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
LB Nagar: గ్లోబల్ ఐవీఎఫ్ సదస్సులో పరిశోధనలకు అంతర్జాతీయ అవార్డు!
ఎల్బీనగర్: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్ ఫెర్టీ9కు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత ఐవీఎఫ్ సదస్సులో ఫెర్టీ9 క్లినికల్ బృందం తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. సంతాన సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నిపుణులను సంప్రదించడం అత్యంత ముఖ్యమన్నారు. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ ఒత్తిడి, ఆలస్య వివాహాలు వంటి కారణాలతో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయని, అయితే ఆధునిక వైద్య సాంకేతికతతో సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే విజయవంతమైన గర్భధారణ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వివరించారు.
డాక్టర్ శృతి మాట్లాడుతూ.. ఫెర్టీ9 ఎల్బీనగర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో ప్రతి దంపతుల అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా ఫెర్టీ9 తన అన్ని కేంద్రాల్లో నీడిల్-ఫ్రీ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. దీంతో రోజువారీ ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పి, భయం, ఆందోళనను తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, భవిష్యత్తులో ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, పునరావృత గర్భస్రావాల నివారణకు ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దంపతులకు మరింత ఆధునిక ఫెర్టిలిటీ సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు.
ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. 36 ఏళ్ల మహిళ ఫెర్టీ9 కేంద్రాన్ని సంప్రదిస్తే ₹36,000 వరకు డిస్కౌంట్, అలాగే మహిళ వయస్సు ఎంత ఉంటే అంత మొత్తంలో డిస్కౌంట్ అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.




