Hyderabad: వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం పింఛన్ల పంపిణీ!

Hyderabad: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ సాయిబాబా మందిరంలో అమావాస్య అన్నదానం నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 15 Jun 2026 5:21 PM IST
Hyderabad
X

Hyderabad: వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం పింఛన్ల పంపిణీ!

హైదరాబాద్: వాసవి మిత్రమండలి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రతినెల నిర్వహించే అమావాస్య అన్నదాన కార్యక్రమం సోమవారం ఈసీఐఎల్ చౌరస్తాలోని సాయిబాబా మందిరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద వృద్ధురాళ్లు మాలే వరమ్మ, కొండూరి విజయ, తోడుపునూరి ఉమారాణి, పడకంటి కమలమ్మలకు ఈ నెల పింఛన్‌ను l ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం నలుగురు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వాసవి మిత్రమండలి ప్రధాన కార్యదర్శి రెబెల్లి శ్రీనివాస్ గుప్త, కోశాధికారి రామిణి తిరుమలేష్ గుప్త, కార్యనిర్వాహక కార్యదర్శి గంప కృష్ణ గుప్త, ఉపాధ్యక్షులు చెన్న చక్రపాణి గుప్త, నంగునూరి అశోక్ గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, కార్యదర్శులు బాచెల్లి నవీన్ గుప్త, అమర కృష్ణ గుప్త, కార్యవర్గ సభ్యులు మిర్యాల అరుణ్ కుమార్ గుప్త, ఉప్పల ఆంజనేయులు గుప్తతో పాటు సభ్యులు ఉప్పల శ్రీనివాసులు గుప్త, రవ్వ ఈశ్వరరావు గుప్త, దిడిగం కైలాసం గుప్త, పెద్ది శ్రీనివాస్ గుప్త, అనుమోలు నర్సింగ్ రావు గుప్త, పరిటాల సురేష్ గుప్త, గెల్వి ప్రసాద్ గుప్త, కొకలా కృష్ణమూర్తి గుప్త, రాజూరి జగదీష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story