Veldanda: మృతి చెందిన అలివేలు కుటుంబానికి ఆర్థిక సాయం!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం తిమ్మినోనిపల్లిలో మృతి చెందిన అలివేలు కుటుంబానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తరఫున ఆర్థిక సాయం అందజేత.
Veldanda: మృతి చెందిన అలివేలు కుటుంబానికి ఆర్థిక సాయం!
వెల్దండ: మండలంలోని తిమ్మినోనిపల్లి గ్రామానికి చెందిన కడవంచి అలివేలు ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తరఫున గురువారం రూ.5,000/ రూపాయల ఆర్థిక సహాయాన్ని యాదగిరిరెడ్డి, తిరుపతిరెడ్డి, గండికోట రాజు, పాత్లవత్ రాజు నాయక్ ల ద్వారా మృతురాలి భర్త శ్రీశైలానికి అందజేశారు.
ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, మణిపాల్, శోభన్ బాబు, శివ, భాస్కర్, శివరాజ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.




