Saroornagar: రమణమూర్తిపై కేసు నమోదు రాష్ట్రీయ వానరసేన తీవ్ర హెచ్చరిక!

Saroornagar: హిందూ ఇతిహాసాలను వక్రీకరించి అవమానకరంగా మాట్లాడిన రమణమూర్తిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

RAHUL, MEERPET
Updated on: 14 Aug 2026 10:16 AM IST
Saroornagar
X

Saroornagar: రమణమూర్తిపై కేసు నమోదు రాష్ట్రీయ వానరసేన తీవ్ర హెచ్చరిక!

Saroornagar: ఇతిహాసాలను వక్రీకరించే వారిని దేవి దేవతల గురించి అవమానకరంగా మాట్లాడే వారిని ఉపేక్షించే పద్ధతులకు హిందువులు చరమగీతం పాడారు అంటూ రాష్ట్రీయ వానర సేన గోరక్ష విభాగం అధ్యక్షులు శ్రీరామ్ కుమార్ జోషి వ్యాఖ్యానించారు.

సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో 851/ 2026 కేసు నమోదు చేసిన అనంతరం మాట్లాడుతూ హిందువుల గ్రంథాల వక్రీకరణ చేసే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అంటూ వెల్లడించారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన నడుస్తోంది అంటూ ఇటువంటి హిందూ వ్యతిరేకుల పైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.

అయితే ఇదివరకే జనహర్ష రమణమూర్తి అలియాస్ విజయ విహారం రమణమూర్తి అనే వ్యక్తి గతంలో కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్యానాలు అనేకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే విషయంపైన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయినది.

RAHUL, MEERPET

RAHUL, MEERPET