KPHB: కేపీహెచ్‌బీ నిజాంపేట్‌లో అగ్నిప్రమాదం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగిసిపడిన మంటలు!
KPHB: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.
KPHB: కేపీహెచ్‌బీ నిజాంపేట్‌లో అగ్నిప్రమాదం: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగిసిపడిన మంటలు!
హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెకండ్ శనివారం సందర్భంగా బ్యాంక్‌కు సెలవు ఉండటంతో ఘటన సమయంలో సిబ్బంది, ఖాతాదారులు ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. బ్యాంక్ భవనం నుంచి భారీగా పొగలు, మంటలు వస్తున్నాయని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అగ్నిప్రమాదం కారణంగా బ్యాంక్ అంతటా దట్టమైన పొగ వ్యాపించగా, కంప్యూటర్లు, ఫర్నిచర్, ముఖ్య పత్రాలకు నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఫైర్ స్టేషన్ ఆఫీసర్ జగన్మోహన్ నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.




