Hyderabad: మాదాపూర్ టాటా షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లోని టాటా షోరూమ్‌లో శనివారం ఉదయం ఆకస్మిక అగ్నిప్రమాదం సంభవించింది.
Hyderabad: మాదాపూర్ టాటా షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లోని టాటా షోరూమ్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షోరూమ్‌లోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో స్థానికంగా కొంతసేపు ఆందోళన నెలకొంది.
మాదాపూర్‌లోని టాటా షోరూమ్‌లో ఈ ఉదయం ఆకస్మికంగా అగ్నిప్రమాదం సంభవించింది. షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న సామగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




