Alwal: మచ్చ బొల్లారంలో అపార్ట్‌మెంట్‌ బైట్ చోటుచేసుకున్న మంటలు!

Alwal: అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు, దగ్ధమైన ఫర్నిచర్. ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు.

PURENDAR, ALWAL
Published on: 29 Oct 2026 7:20 AM IST
Alwal
X

Alwal: మచ్చ బొల్లారంలో అపార్ట్‌మెంట్‌ బైట్ చోటుచేసుకున్న మంటలు!

Alwal: అల్వాల్‌ పరిధిలోని మచ్చ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గంగా ఎన్‌క్లేవ్‌లోని ఎస్టిలో డివైన్ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ దగ్ధమైంది. అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించడాన్ని గమనించిన నివాసితులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో సంబంధిత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అల్వాల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL