Hyderabad: 26 ఏళ్లుగా అన్నదానం.. చేప ప్రసాదం రోగులకు బసవ కేంద్రం భరోసా!
Hyderabad: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ చేరుకున్న ఆస్తమా రోగులు.
Hyderabad: 26 ఏళ్లుగా అన్నదానం.. చేప ప్రసాదం రోగులకు బసవ కేంద్రం భరోసా!
Hyderabad: చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు. పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ.. అపన్నాహస్తం అందిస్తున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతియేటా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆస్తమా రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది.
రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి బోనజాన్ని అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. గత 26ఏళ్లుగా ఈ అన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు ఈనెల 8న రాత్రి ప్రారంభమయ్యే చేప మందు పంపిణీకి టోకెన్ లను ఈరోజు నుండే విక్రయిస్తుండటంతో. ఒక రోజు ముందే చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకొని. క్యూ లైన్ నిలబడి టోకెన్లు తీసుకుంటున్నారు.




