Hayathnagar: కమలానగర్ గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో కళ్లెం నవజీవన్ రెడ్డి!
Hayathnagar: హయత్నగర్ డివిజన్ పరిధిలోని కమలా నగర్ కాలనీలో నిర్వహించిన గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు.
Hayathnagar: కమలానగర్ గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో కళ్లెం నవజీవన్ రెడ్డి!
Hayathnagar: హైకోర్టు కాలనీ డివిజన్ పరిధిలోని కమలా నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గ్రంథాలయ వార్షికోత్సవ వేడుకల్లో హయత్నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకులకు, సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి, విజ్ఞాన వికాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి, సామాజిక అవగాహన పెరుగుతాయని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ గ్రంథాలయాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, వాటిని మరింత అభివృద్ధి చేసి భావితరాలకు విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహకులు, సభ్యులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గోకుల మదన్ రెడ్డి, కమలా నగర్ నివాసుల సంక్షేమ సంఘం సభ్యులు గణేష్, తుమ్మల సుబ్బారావు, టీవీ రావు, రామారావు, తవుటం సంగ్రామ్, గాండ్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.




