Hayathnagar: గ్రీన్‌వుడ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పర్యటన!
Hayathnagar: గ్రీన్‌వుడ్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. డ్రైనేజీ పైప్‌లైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ.
Hayathnagar: గ్రీన్‌వుడ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పర్యటన!
హయత్‌నగర్: ఉమ్మడి హయత్‌నగర్ డివిజన్‌లోని గ్రీన్‌వుడ్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ సదుపాయం లేకపోవడంతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు.
భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణం కోసం గతంలోనే జలమండలి అధికారులతో చర్చించి ఎస్టిమేషన్స్ రూపొందించినట్లు తెలిపారు. అయితే డివిజన్ విభజన కారణంగా పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి జలమండలి అధికారులతో కలిసి గ్రీన్‌వుడ్ కాలనీలో పర్యటించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి కొత్తగా ఎస్టిమేషన్స్ రూపొందించి పనులను త్వరితగతిన ప్రారంభించాలని జలమండలి సిబ్బంది రాజేందర్‌కు సూచించారు.
కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ అధ్యక్షులు గణేష్‌తో పాటు కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.




