Kapra: రామ్‌దాస్ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటన!

Kapra: కాప్రా డివిజన్ రామ్‌దాస్ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటించారు. సీసీ రోడ్ల సమస్యలపై కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.

ASHOK, KAPRA
Updated on: 14 Aug 2026 11:08 PM IST
Kapra
X

Kapra: రామ్‌దాస్ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పర్యటన!

కాప్రా: కాప్రా డివిజన్లోని రామ్ దాస్ నగర్ మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి చేసిన అభివృద్ధిని కృషికి గుర్తుచేసుకుంటూ రామ్ దాస్ నగర్ కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో ఘనంగా ఆయనను సన్మానించారు. అలాగే నాలుగు చిన్న వీధుల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందించారు.

మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ - రామ్ దాస్ నగర్ లో మిగిలిన అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు అధికారులకు అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి అధికప్రాధాన్యతనిస్తూ, నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రామ్ దాస్ నగర్ అభివృద్ధికి తాను చేసిన కృషికి, రెసిడెన్సియల్ ప్రతినిధులు సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్,బాబురావ్, నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, సతీష్ యాదవ్, నాగరాజ్ యాదవ్ రాందాస్ నగర్ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అభిషేక్, ప్రధాన కార్యదర్శి అసద్, సలహాదారులు ఎండి సలాలుద్దీన్ , బిశ్వజిత్ రాయ్, కార్యవర్గ సభ్యులు రాకేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story