Hayathnagar: హయత్నగర్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో నవజీవన్ రెడ్డి!
Hayathnagar: హయత్నగర్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి మండపాలను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం.
Hayathnagar: హయత్నగర్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో నవజీవన్ రెడ్డి!
Hayathnagar: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హయత్నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పలు అమ్మవారి మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హయత్నగర్లోని శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ (ముదిరాజ్ యువజన సంఘం), అనుమగల్లోని డైమండ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను ఆయన సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇట్టబోయిన నర్సింహా తదితరులు పాల్గొన్నారు.




