Osmania University: ఓయూలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
Osmania University: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.
Osmania University: ఓయూలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు కొమ్మనబోయిన సైదులు ఆధ్వర్యంలో తలా సేమ్యా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేందుకు సుమారు వందమందితో రక్తదాన కార్యక్రమం చేసి, మొక్కలు నాటి, కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటం, రాష్ట్ర అభివృద్ధిలో జగదీశ్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని తెలిపారు.
ఆయన దీర్ఘాయుష్షుతో పాటు మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




