Tandur: తాండూరులో ఘనంగా మాజీ మంత్రి మాణిక్‌రావు వర్ధంతి!
Tandur: తాండూరులో మాజీ మంత్రి మాణిక్‌రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి విద్యా వికాస్ సమితి చైర్మన్ శశిప్రభ, ప్రముఖులు నివాళులర్పించారు.
Tandur: తాండూరులో ఘనంగా మాజీ మంత్రి మాణిక్‌రావు వర్ధంతి!
తాండూరు: తాండూరు ముద్దుబిడ్డ మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు బలమైన స్వరం అందించిన నాయకుడు మాణిక్‌రావు అని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ చైర్మన్ శశిప్రభ మాణిక్‌రావు అన్నారు. మంగళవారం మాణిక్‌రావు వర్ధంతి వేడుకలను తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి మాణిక్‌రావు ప్రజాసేవతో పాటు విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే పీపుల్స్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. మాణిక్‌రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ట్రస్టు ద్వారా
విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ట్రస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా సంరక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తఫా పటేల్, సుభాన్‌రెడ్డి, అడ్వకేట్ అరుణ్‌కుమార్‌తో పాటు మాణిక్‌రావు అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




