Quthbullapur :షాపూర్‌నగర్ లో ప్రజల వినతులు స్వీకరించిన కూన శ్రీశైలం గౌడ్
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ షాపూర్‌నగర్‌లోని తన కార్యాలయంలో ప్రజలను కలిసి వినతులు స్వీకరించారు.
Quthbullapur :షాపూర్‌నగర్ లో ప్రజల వినతులు స్వీకరించిన కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని నియోజకవర్గంలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు షాపూర్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు. అలాగే పలువురు తమ కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందించి, కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ప్రజలు వివరించిన సమస్యలను మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. అత్యవసరమైన కొన్ని సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోగా, మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం నా బాధ్యత. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




