Malkajgiri: బాధిత కుటుంబాలకు మైనంపల్లి అండ.. ఆకునూరులో పరామర్శ!
Malkajgiri: ఆకునూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించి భరోసా కల్పించారు.
Malkajgiri: బాధిత కుటుంబాలకు మైనంపల్లి అండ.. ఆకునూరులో పరామర్శ!
Malkajgiri: కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి, వారి బాధను పంచుకోవడమే నిజమైన మానవత్వమని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆపదలో ఉన్న వారికి రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో సోమవారం ఆకునూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఆకునూరు గ్రామ మాజీ ఎంపీటీసీ కరెడ్ల రాంరెడ్డి సతీమణి ప్రమీల ఇటీవల మృతి చెందడంతో ఆమె నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు, కుమారుడు కరెడ్ల రాజేశ్వర్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రమీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరిని కోల్పోవడం భరించలేని విషాదమని అన్నారు. ప్రమీల మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.అందరితో ఆప్యాయంగా మెలిగే ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని,వారికి తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
అనంతరం నేరేడ్‌మెట్‌కు చెందిన ఈనాడు విలేకరి మహేష్ తండ్రి గణేష్ ప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న మైనంపల్లి, ఆకునూరులోని మహేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేష్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి,మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. బాధలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం,వారికి మనోధైర్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ప్రజల కష్టసుఖాల్లో తన వంతు బాధ్యతగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, మాజీ సర్పంచ్ వెలగల రఘువీర్,మత్స్యశాఖ మాజీ చైర్మన్ బోయిని రాజు,కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఆకుల రాజు, మాజీ ఎంపీటీసీలు సుంకరి శ్రీధర్,పల్లె కనకయ్య,నాయకులు కోయినేని నరసయ్య, మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్‌బాగ్ మాజీ కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్,ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి.ఎన్.వి. సతీష్‌కుమార్, సత్యనారాయణ,బాబా, చుంకు శ్రీనివాస్, రాందాస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




