Kuntloor: వైభవంగా నల్ల పోచమ్మ బోనాలు.. పాల్గొన్న ఈదమ్మల బలరాం!

Kuntloor: హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్పలో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.

AJAY, HAYATH NAGAR
Published on: 24 Aug 2026 11:49 PM IST
Kuntloor
X

Kuntloor: వైభవంగా నల్ల పోచమ్మ బోనాలు.. పాల్గొన్న ఈదమ్మల బలరాం!

కుంట్లూరు: రాజీవ్ గృహకల్ప కుంట్లూరులో నిర్వహించిన శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ వేడుకల్లో పెద్దఅంబర్‌పేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఈదమ్మల బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అమ్మవారి ఆశీస్సులతో రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈదమ్మల బలరాం ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కాలనీలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు మాడుగుల వెంకటేష్, జోర్క రాములు, గోదల వెంకట్‌రెడ్డి, కాలనీ అధ్యక్షులు నందు సింగ్, కొప్పుల శ్రీధర్‌రెడ్డి, BJP నాయకులు కృష్ణమాచార్యులు, కాంగ్రెస్ నాయకులు మహంత్, జై భీమ్ ఆర్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పనికర కృష్ణ బహుజన, ప్రధాన కార్యదర్శి మంచాల మారయ్య, సంయుక్త కార్యదర్శి తునిక భాస్కర్, కోశాధికారి నల్ల యాదయ్య, EC సభ్యులు బిక్షపతి, సత్యనారాయణతో పాటు కాలనీ పెద్దలు జ్ఞానేశ్వర్, యాదయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story