Nagaram: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

Nagaram: ఆగస్టు 15న నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి యోగా సెంటర్‌లో జాతీయ జెండాల పంపిణీ. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జెండాను ఎగురవేయాలని కోరారు.

ASHOK, KAPRA
Published on: 12 Aug 2026 9:11 AM IST
Nagaram
X

Nagaram: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

Nagaram: నాగారం డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి నాగారం యోగ సెంటర్‌లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములై, తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని చంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story