Kadthal: పోచమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు రూ. 54,116 విరాళం అందజేత!

Kadthal: కడ్తాల్ పోచమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు రూ. 54,116 విరాళం అందజేసిన మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పిలుపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Sept 2026 3:20 PM IST
Kadthal
X

Kadthal: పోచమ్మ ఆలయ బోనాల ఉత్సవాలకు రూ. 54,116 విరాళం అందజేత!

Kadthal: ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవడంతో ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత పొందుతారని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు.ఆదివారం రోజున గ్రామదేవత పోచమ్మ దేవాలయంలో,బోనాల ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కమిటీ సభ్యులను కోరారు.

గ్రామంలో బోనాల ఉత్సవాల నిర్వహణకు పోచమ్మ దేవాలయం ఉత్సవ కమిటీ సభ్యులకు, 54,116/-రూపాయల విరాళాన్ని అందజేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దేవాలయాల అభివృద్ధి మరియు మౌలిక వసతుల ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో నాలుగు రోజులపాటు జరిగే బోనాల ఉత్సవ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యం యాదవ్, సింగల్ విండో చైర్మన్ గంపా వెంకటేష్ గుప్తా, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కంబాల పరమేష్,వార్డు సభ్యులు మాధారం గణేష్ గౌడ్,కమిటీ సభ్యులు చేగూరి రాములు గౌడ్, గూడూరు శేఖర్ రెడ్డి,మాలె మల్లేష్ గౌడ్,వాంకుడావత్ రాంచందర్ నాయక్,గురిగళ్ల రామచంద్రయ్య, మూడ అశోక్,అమృతం పాండు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story