Hyderabad: నా పునాది ఈ పాఠశాలే.. జూనియర్ సివిల్ జడ్జి భావోద్వేగం!

Hyderabad: కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.

GIRI, CENTRAL ZONE
Published on: 13 May 2026 5:33 PM IST
Hyderabad
X

Hyderabad: నా పునాది ఈ పాఠశాలే.. జూనియర్ సివిల్ జడ్జి భావోద్వేగం!

Hyderabad: జూనియర్ సివిల్ జడ్జ్‌గా నియమితులై ప్రస్తుతం రామన్నపేట భువనగిరి యాదగిరి జిల్లా కోర్టులో తన విధులు నిర్వహిస్తున్నాన వదినపల్లి రత్నకుమారి తాను చదువుకున్న ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్, కవాడిగూడ (పాఠశాల 2015-16 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థిని ..)పాఠశాల

కరస్పాండెంట్ , ప్రిన్స్‌పాల్ మరియు ఉపాధ్యాయులకు తన ధన్యవాదాలు తెలియజేస్తూ తన ఎదుగుదలకు ఈ పాఠశాల పదవతరగతి వరకు ఇచ్చిన బేసిక్ స్టాండర్డ్స్ వల్లే ఇది సహాయపడిందని తను ఈ సంధర్భంగా గుర్తుచేసుకొని హర్షాన్ని వ్యక్తం చేశారు.

కరస్పాండెంట్ పులిగారి గోవర్దన్ రెడ్డి , ప్రిన్స్‌పాల్ పి. స్వర్ణలత మరియు ఉపాధ్యాయులు తదితరులు ఆమెకు సన్మానం చేసినారు . మా పాఠశాల పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి గారు ఈ స్థాయికి చేరుకోవడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story