Kadthal: 15 రోజులైనా దక్కని బస్తాలపై మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆగ్రహం!
Kadthal: మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆన్‌లైన్ యూరియా విధానాన్ని నిరసించారు. రైతుల ఇబ్బందులను దృష్ట్యా ఆఫ్‌లైన్ లో ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Kadthal: 15 రోజులైనా దక్కని బస్తాలపై మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆగ్రహం!
కడ్తాల్: కడ్తాల్ మండల కేంద్రంలో హాక సెంటర్ కి వెళ్లి ఆన్ లైన్ ద్వారా యూరియా బ్యాగులు కొనుగోలు చేసినా మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ తన వ్యవసాయ పొలం కోసం అవసరపడే యురియ బ్యాగులకు దాదాపుగా 15 రోజుల క్రితం ఆన్ లైన్ ద్వారా బుక్ చేస్తే ఈరోజు యూరియా బ్యాగులు లభించడం జరిగింది.
ఈ ఆన్ లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతంగానికి ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ చేసుకోవడం రాక నా నా ఇబ్బందులకు గురవుతున్నారు గత కెసిఆర్ ప్రభుత్వంలో ఆన్ లైన్ లేకుండా ఆఫ్లైన్ ద్వారా స్వయానా రైతులు ఇబ్బంది పడకుండా సింగిల్ విండో ద్వారా ఆగ్రో సెంటర్ల ద్వారా హక సెంటర్లో ద్వారా ఫర్టిలైజర్ డీలర్ల ద్వారా పంట సీజన్ రాకముందే అడ్వాన్స్ గా టన్నుల కొద్దిగా యూరియా కావచ్చు అదేవిధంగా వివిధ రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచేవారని ఆయన తెలియజేశారు.
రేవంత్ ప్రభుత్వం ఆన్ లైన్ యూరియాను తొలగించి ఆఫ్లైన్ యూరియా కెసిఆర్ ప్రభుత్వం అందించినట్టు అందించాలని హెచ్చరించారు నిర్వాహకుడు నరేష్ నాయక్ తో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీ హక సెంటర్ ద్వారా ఎరువులను అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో. సర్పంచ్ ప్రియరమేష్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ సువాలి పంతు నాయక్ వార్డ్ సభ్యుడు మల్లేష్ నాయక్ నాయకులు రైతులు గోపాల్ సక్రు నరేష్ రాజు రాములు శీను నరేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




