Hyderabad: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!

Hyderabad: ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 17 Sept 2026 4:27 PM IST
Hyderabad
X

Hyderabad: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!

హైదరాబాద్: గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ఎదుట బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచారు.

అనంతరం మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాజేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.. 2022 సెప్టెంబరు 30న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజన యువతకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఏర్పడిందని తెలిపారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, గిరిజన గురుకులాలు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లతో పాటు తండాలకు పంచాయతీ హోదా, విద్య, ఉపాధి, స్వయం పాలన దిశగా చర్యలు చేపట్టిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు, విద్యార్థులు, గిరిజన యువత పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA