Madugula: నాగిళ్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
Madugula: మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో సర్పంచ్ సంతోష రాజు గౌడ్, శాలివాహన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
Madugula: నాగిళ్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
రంగారెడ్డి జిల్లా: మాడుగుల మండల పరిధిలోని నాగిళ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ సంతోష రాజు గౌడ్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శాలివాహన హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు పలు వైద్య చికిత్సలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ కృష్ణ గౌడ్ మాజీ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాలయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, మాజీ సర్పంచ్ బండ నరసింహ, పాలకూర్ల వెంకటయ్య, వార్డు సభ్యులు నాగిళ్ల పెద్దయ్య, బొల్లు కిట్టు, బండ శీను, లక్ష్మీ శ్రీశైలం, లక్ష్మయ్య, కాటం కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




