Medipally: పాములపై అవగాహనతోనే భయం దూరం!
Medipally: మేడిపల్లి శాంతివనం అర్బన్ ఫారెస్ట్ పార్కులో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా పాముల గుర్తింపు మరియు సంరక్షణపై ఉప్పల్ ఎఫ్‌ఆర్‌ఓ శరత్ చంద్రారెడ్డి అవగాహన కార్యక్రమం.
మేడిపల్లి: పాములపై అవగాహనతోనే భయం దూరం!
Medipally: పాములపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, వాటి పట్ల ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు వన్యప్రాణి వారోత్సవం–2026లో భాగంగా మేడిపల్లి 2 ఆర్‌ఎఫ్‌లోని శాంతివనం అర్బన్ ఫారెస్ట్ పార్కులో పాములపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ ఎఫ్‌ఆర్‌ఓ శరత్‌చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ రకాల విషపూరిత, విషరహిత పాములను ప్రత్యక్షంగా చూపించి వాటి గుర్తింపు, స్వభావం, ఆహారపు అలవాట్లను వివరించారు. పర్యావరణ వ్యవస్థలో పాముల ప్రాధాన్యం, జీవ వైవిధ్య పరిరక్షణలో అవి పోషించే పాత్రపై అవగాహన కల్పించారు. అనుకోకుండా పాము కనిపించినప్పుడు ప్రజలు భయపడకుండా, దానిని పట్టుకోవడానికి లేదా చంపేందుకు ప్రయత్నించకుండా సురక్షితంగా దూరంగా ఉండాలని సూచించారు.
పాము కాటుకు గురైనప్పుడు బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని, ఎలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా వైద్య చికిత్స పొందాలని వివరించారు. ప్రజల్లో పాములపై ఉన్న అపోహలను తొలగించి, వన్యప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన పెంచడమే కార్యక్రమం ఉద్దేశమని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ప్రతినిధులు, పార్కు వాకర్లు, స్థానికులు పాల్గొన్నారు.




