Marichi: వైద్య రంగంలో 'మారిచీ' వెబ్ అప్లికేషన్ ఆవిష్కరణ!

Marichi: వైద్య రంగంలో రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణకు ఫ్యూట్రాన్ సొల్యూషన్స్ 'మారిచీ' వెబ్ యాప్‌ను పరిచయం చేసింది. బంజారాహిల్స్‌లో సదస్సు.

RAJESH,	WEST ZONE
Published on: 14 Aug 2026 12:07 PM IST
Marichi
X

Marichi: వైద్య రంగంలో 'మారిచీ' వెబ్ అప్లికేషన్ ఆవిష్కరణ!

Marichi: పదేళ్లలో వైద్య రంగంలో రేడియో ధార్మిక పదార్థాల వినియోగం పెరిగిందని ఫ్యూట్రాన్ సొల్యూషన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శౌర్య అన్నారు. బంజారాహిల్స్లోని ఎంపీ ఎం మాల్లో ఆయన రేడియేషన్ ఇన్వెంటరీ మేనేజ్ మెంట్పై రూపొందించిన 'మారిచీ'అనే వెబ్ ఆధారిత అప్లికేషన్ గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ మారిచీ అనే అప్లికేషన్ వైద్యరంగంలో ఉన్న ప్రొఫెషనల్ పాటు వైద్యులు, రేడియాలజిస్ట్లు, హెల్త్కేర్ ప్రొవైడర్లకు, న్యూక్లియర్ మెడిసిన్, అంకాలజీ, కార్డియాలజీ, ఇమేజింగ్ ఆధారిత శస్త్ర చికిత్సలు తదితర రంగాలకు ఈ సాంకేతికత ఎంతో ఉపయో గపడుతుందన్నారు. ఇండియాలో ఈ తరహా అప్లికే షన్ ఇది మొదటిది అని ఆయన అన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story