Amangal: ఆమనగల్లు సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ పటిష్టం చేయాలి!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ జాయింట్ సీపీ చందన దీప్తి అధికారులకు సూచించారు.
Amangal: ఆమనగల్లు సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ పటిష్టం చేయాలి!
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ జాయింట్ పోలీస్ కమిషనర్ చంద్రన దీప్తి అధికారులకు సూచించారు. శుక్రవారం ఆమనగల్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించారు.
ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల రాకపోకల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ శంకరయ్య ఫ్యూచర్ సీటీ పోలీస్ కమిషనరేట్ జాయింట్ పోలీస్ కమీషనర్ చంద్రన దీప్తికి స్వాగతం పలికారు.




