Hyderabad: గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వద్ద విషాదం ఇద్దరు మృతి!

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR) సర్వీస్ రోడ్డుపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 8 Aug 2026 9:20 AM IST
Hyderabad
X

Hyderabad: గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ వద్ద విషాదం ఇద్దరు మృతి!

Hyderabad: ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాత్రి వేళ ప్రమాదం: పిల్లర్‌ను ఢీకొట్టిన తవేరా కారు, ఇద్దరు రాజస్థాన్ యువకులు అక్కడికక్కడే మృతి..

గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR) సర్వీస్ రోడ్డుపై అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24) అనే ఇద్దరు యువకులు కొల్లూరులోని ఇంద్రారెడ్డి నగర్‌లో నివాసముంటూ టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో, వీరిద్దరూ కలిసి తవేరా కారు (నంబర్: AP01AB2232) లో ఇంద్రారెడ్డి నగర్ నుండి నానక్‌రామ్‌గూడలోని సత్వా వైపు ప్రయాణమయ్యారు.

కారు డంపింగ్ యార్డ్ సమీపంలోని నియో పోలీస్ బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే, వాహనం నడుపుతున్న కనైయాలాల్ అతివేగంగా నడపడంతో కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి మార్గమధ్యలో ఉన్న బ్రిడ్జ్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, కారులో ఉన్న కనైయాలాల్, దేరామ్ ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story