Gachibowli: గచ్చిబౌలి పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించిన కోర్టు!

Gachibowli: మైనర్ బాలిక అత్యాచార కేసులో నిందితునికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల పరిహారం విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 10 Sept 2026 6:36 AM IST
Gachibowli
X

Gachibowli: గచ్చిబౌలి పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించిన కోర్టు!

Gachibowli: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని హానరబుల్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీ టి. శ్రీనివాస్ ఈ మేరకు బుధవారం (09.09.2026) సంచలన తీర్పు వెలువరించారు.

*కేసు వివరాలు:*

పోలీసుల సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా మాచర్ల/మాచవరం మండలం పెనుమల్లి గ్రామానికి చెందిన మీనగళ్ల వేణుగోపాల్ అలియాస్ వేణు (42) కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటూ సెంటరింగ్ పని చేసుకుంటున్నాడు. 2023లో మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 642/2023 కింద IPC 376AB, 506, పోక్సో చట్టంలోని 5(m), 5(i) r/w 6 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

*కోర్టు తీర్పు:*

సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడు వేణుగోపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3,000 జరిమానా విధించారు. దీంతో పాటు బాధితురాలికి రూ. 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.

ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టిన మాధాపూర్ డివిజన్ నాటి ఏసీపీలు సిహెచ్. రఘునందన్ రావు, పి. శ్రీనివాస్, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ కె. సైదులు, కేసును కోర్టులో విజయవంతంగా వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. వెంకటేశ్వర్ రెడ్డి, కోర్టు విధుల అధికారులు (CDO) సురేఖ, హెచ్‌సీ భీమ్‌సేన్, ఏఎస్‌ఐ శివారెడ్డిలను ఉన్నతాధికారులు అభినందించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story