Gachibowli: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు ఇద్దరు బలి!
Gachibowli: హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎంబీ ఫ్లైఓవర్‌పై భీకర రోడ్డు ప్రమాదం. రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూటీని ఢీకొట్టిన బుల్లెట్.. ఇద్దరు అక్కడికక్కడే మృతి.
Gachibowli: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు ఇద్దరు బలి!
Gachibowli: గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని ఏఎంబీ ఫ్లైఓవర్ పై ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉదయం సుమారు 07:25 గంటల సమయంలో గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ తీవ్రమైన ఘాతానికి స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, వెనుక కూర్చున్న వ్యక్తి విఠల్ ఇద్దరూ రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకునీ దర్యాప్తు చేస్తున్నారు.




