Gachibowli: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య

Gachibowli: గచ్చిబౌలి వాసవి జీపీ ట్రెండ్స్ అపార్ట్‌మెంట్‌లో విషాదం. 17వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుజీత్ కుమార్ పండిట్ ఆత్మహత్య. కేసు నమోదు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 1 Aug 2026 6:08 AM IST
Gachibowli
X

Gachibowli: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య

గచ్చిబౌలి: నగరంలోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలిలోని వాసవి జీపీ ట్రెండ్స్ అపార్ట్‌మెంట్‌, ఫ్లాట్ నంబర్ 1702లో నివాసముంటున్న సుజీత్ కుమార్ పండిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న మృతుడి సోదరుడు అజిత్ కుమార్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు.

తమ సోదరుడి మృతిపై అజిత్ కుమార్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మానసిక ఒత్తిడా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story