Gachibowli: గచ్చిబౌలి స్టేడియంలో 'రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026' నాలుగో ఎడిషన్ ప్రారంభం!

Gachibowli: గచ్చిబౌలి స్టేడియంలో 'రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026' నాలుగో ఎడిషన్. ప్రారంభించిన ఐఏఎస్ జయేష్ రంజన్, సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, ప్రముఖ వైద్య నిపుణులు.

RAJESH,	WEST ZONE
Published on: 9 Aug 2026 3:39 PM IST
Gachibowli
X

Gachibowli: గచ్చిబౌలి స్టేడియంలో 'రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026' నాలుగో ఎడిషన్ ప్రారంభం!

Gachibowli: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.

ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ లతో పాటు రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ పీడియాట్రిషియన్ డాక్టర్ రాధా రమాదేవి, సీడీఎఫ్‌డీ డయాగ్నోస్టిక్స్ విభాగం అధిపతి డాక్టర్ అశ్విన్ దాలాల్, లైట్నింగ్ లైవ్స్ సీఈఓ, శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని కూడా పాల్గొని ఎస్‌ఎంఏ కమ్యూనిటీకి తమ మద్దతు తెలుపుతూ, ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ను ప్రారంభించారు. 21కే, 10కే, 5కే విభాగాల్లో రన్ కొనసాగింది. ప్రొఫెషనల్ రన్నర్లు, ఫిట్‌నెస్‌ ప్రియులు, ఎస్‌ఎంఏతో జీవిస్తున్న చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం చాటారు.

ఈ సందర్భంగా క్యూయర్ ఎస్‌ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకురాలు, ట్రస్టీ శ్రీలక్ష్మి నలం మాట్లాడుతూ.. ఎస్‌ఎంఏ వ్యాధికి సకాలంలో చికిత్స అందించడం చాలా కీలకం..వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే కండరాల పనితీరును తిరిగి పొందలేని అవకాశం ఉంటుందన్నారు. ప్రతి 38 మందిలో ఒకరు ఎస్‌ఎంఏ క్యారియర్‌గా ఉండే అవకాశం ఉందని, చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో తమ క్యారియర్ స్థితి గురించి వారికి తెలియకపోవచ్చాన్నారు. అందువల్ల జన్యు క్యారియర్ స్క్రీనింగ్ నివారణతో పాటు అవగాహన కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని శ్రీలక్ష్మి నలం తెలిపారు.

ఉచిత ఎస్‌ఎంఏ జన్యు క్యారియర్ స్క్రీనింగ్

ఈ ఏడాది ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ’ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ఉచిత ఎస్‌ఎంఏ జన్యు క్యారియర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా స్టేడియం ఆవరణలో నిర్వహించారు. డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, లైట్నింగ్ లైవ్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పాల్గొన్న వారు జన్యు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా తమ క్యారియర్ స్థితిని తెలుసుకునే అవకాశం పొందారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story