Gachibowli: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద మృతి!
Gachibowli: గచ్చిబౌలి గౌలిదొడ్డి జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.
Gachibowli: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద మృతి!
Gachibowli: గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్ (సీ-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702) లో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులు బాతుల మారెడ్డి (65), ఆయన భార్య బాతుల భారతి (60), మరియు వారి కుమారుడు బాతుల నిశాంత్ రెడ్డి (38) లుగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది కాలంగా వీరు ఈ ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. కుటుంబంలో తలెత్తిన తీవ్ర అనారోగ్య సమస్యలు, అంతర్గత కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.




