Secunderabad: కంటోన్మెంట్‌లో గజ్జల నగేశ్ జెండా ఆవిష్కరణ
Secunderabad: కేసీఆర్ పాలనలోనే తెలంగాణ ప్రగతి సాధ్యమైందని కొనియాడిన గజ్జల నగేశ్. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని తీవ్ర విమర్శలు.
Secunderabad: కంటోన్మెంట్‌లో గజ్జల నగేశ్ జెండా ఆవిష్కరణ
సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించడం తెచ్చుకున్న తెలంగాణ ను పది సంవత్సరాలు పాలించి అభివృద్ధి చేసిన ఘనత ఉద్యమసారథి మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందని కంటోన్మెంట్ బేవరేజ్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు..నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ అన్నా నగర్..తిరుమలగిరి తోపాటు పలు ప్రాంతాల్లో కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి జండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జారుకున్నారు.
కేసీఆర్ సాధించి అభివృద్ధి చేసిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేయలేక కుంటు పడేసిందని గజ్జల నాగేశ్ ఆరోపించారు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అనే నినాదంతో బి ఆర్ ఎస్ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని,మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమని దీమా వ్యక్తం చేశారు.




