Quthbullapur: తీగలు తొలగిస్తేనే వెలుగులు, పగటి వెలుగులు పట్టవా?

Quthbullapur: కుత్బుల్లాపూర్ గాజులరామారం ఉషోదయ కాలనీలో అధికారుల నిర్లక్ష్యం. తీగల్లో చిక్కుకుని రాత్రి వేళల్లో వెలగని వీధి దీపం, పగటి పూట ఆపకపోవడంతో వృథా.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Jun 2026 6:34 PM IST
Quthbullapur
X

Quthbullapur: తీగలు తొలగిస్తేనే వెలుగులు, పగటి వెలుగులు పట్టవా?

Quthbullapur: ఇది కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం, ఉషోదయ కాలనీలో రోడ్డులోని వీధి దీపం ఇలా స్తంభం కింది నుంచి పైవరకు చుట్టూ తీగలు అల్లుకుపోయాయి. దీపం వెలుగులు రోడ్డుపై పడలేని పరిస్థితి. అధికారులు స్పందించి తీగలు తొలగించి వెలుగులు ప్రసరింపజేయాలని, పగటి వెలుగులతో విద్యుత్తు వృథా అవుతోంది.

నియంత్రించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఎప్పుడో చేతులెత్తేశారు. నానాటికీ సమస్య పెరుగుతుందేగానీ.. తగ్గు ముఖం పట్టడంలేదు. ఉన్నతాధికారులు సైతం ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story