Tarnaka: నర్సు శిరీష హత్య కేసు నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి!

Tarnaka: నర్సు శిరీష హత్య కేసు నిందితుడు సనావుల్లా ఖాన్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి: ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్.

HARISH, TARNAKA
Published on: 1 Sept 2026 4:19 PM IST
Tarnaka
X

Tarnaka: నర్సు శిరీష హత్య కేసు నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి!

Tarnaka: తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న శిరీషపై అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో, నిందితుడిగా పేర్కొంటున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సనావుల్లా ఖాన్‌కు చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

తార్నాకలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ కమిటీ సభ్యుడు అలిగె జీవన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేయాలని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న వివిధ నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నగర ప్రజలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆహార కల్తీ, చోరీలు, దోపిడీలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story