Hayathnagar: హయత్‌నగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Hayathnagar: హయత్‌నగర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, ఘన నివాళులర్పించారు.
Hayathnagar: హయత్‌నగర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
Hayathnagar: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హయత్‌నగర్‌లో ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు, ఆయన పాటించిన నిజాయితీ, నిరాడంబరత, క్రమశిక్షణ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. “జై జవాన్ – జై కిసాన్” అనే నినాదంతో సైనికులు, రైతుల ప్రాధాన్యతను దేశానికి చాటిచెప్పిన మహనీయుడు శాస్త్రి అని కొనియాడారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంతో పాటు శాస్త్రి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, హైకోర్టు కాలనీ డివిజన్ అధ్యక్షులు మధుసూదన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్టబోయిన నర్సింహా, నాయకులు జంజ్య నాయక్, వస్పరి వెంకటేష్, బాలు నాయక్, ఉగాది బాలు, అరుణ్, ఎర్ర శ్రీను, బీజేవైఎం నాయకులు ఎర్ర ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.




