Abdullapurmet: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి!
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, నివాళులర్పించారు.
Abdullapurmet: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి!
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బింగి దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మండల కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం, దేశ సేవా సిద్ధాంతాలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, బాటసింగారం మాజీ ఎంపీటీసీ కేశెట్టి వెంకటేష్, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పు వెంకటేష్, ఎర్రవెల్లి మారుతి ప్రసాద్, గుండె నరసింహ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల ప్రణీత్ యాదవ్, లస్కర్‌గూడ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు సుర్వి సుదర్శన్, సంభ, నాతి రమేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు అల్లి బాలకృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




