Malkajgiri: మల్కాజిగిరి గాంధీ పార్క్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Malkajgiri: మల్కాజిగిరి గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 2 Oct 2026 5:01 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరి గాంధీ పార్క్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Malkajgiri: గాంధీ జయంతి సందర్భంగా మల్కాజిగిరి గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ మార్గాల్లో ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, త్యాగాలు, ప్రజల్లో స్వేచ్ఛా భావాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జీవన్‌రెడ్డి, జీఎన్‌వీ సతీష్‌కుమార్, పిట్టల శ్రీనివాస్, ఏకే మురుగేష్, డివిజన్ అధ్యక్షుడు జీడీ సంపత్‌గౌడ్, సత్యమూర్తి, పిట్టల నాగరాజు, రాందాస్, సంతోష్ ముదిరాజ్, రామచందర్, బాబు, శ్రీరామ్ యాదవ్, పార్థు, బాల్‌రాజ్ యాదవ్, సయ్యద్ మబ్బు, బ్రహ్మయ్య, ఇస్తారి, కన్నా, చెన్నారెడ్డి, రామకృష్ణ, రాము, అరుణ్, ఆశా, మైముద బేగం, చుంకు శ్రీనివాస్, ఆగమయ్య, యాదగిరి, శ్రీనివాసచారి, సంపత్‌రావు, ధరణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri