Talakondapally: రాంపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Oct 2026 4:57 PM IST
Talakondapally
X

Talakondapally: రాంపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మహాత్మా గాంధీజీ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధన కోసం మహాత్మా గాంధీజీ చేసిన పోరాటం, దేశానికి అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సత్యం, అహింస, శాంతి, సోదరభావం వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.

ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం గాంధీజీ జయంతి సందర్భంగా వీబీ-జీ రామ్‌జీ, జల్ జీవన్ మిషన్ పనులపై గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ అధ్యక్షత వహించారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి రవీందర్, వార్డు సభ్యులు దొరిబాయి లాలమ్మ-జంగయ్య, తిక్కల జంగయ్య, చంద్రకళ-సుధాకర్, కాకి రాము, పబ్బ రమేష్, మత్స్యకార సొసైటీ జనరల్ సెక్రటరీ చిల్కం శేఖర్, మాజీ సర్పంచ్ మనమ్మ-యాదయ్య, మాజీ ఎంపీటీసీ కటికల భీమమ్మ-యాదయ్య, జర్నలిస్టు మీసాల మహేష్, మాజీ వార్డు సభ్యులు మీసాల ఆంజనేయులు, తిక్కల మహేష్, నాయకులు షర్ఫుద్దీన్, పాండు రెడ్డి, విజయ్ కుమార్, రొయ్యల మహేష్, బీఎల్‌ఓ మద్ది కృష్ణారెడ్డి, రొయ్యల రమేష్, హరికృష్ణ, శ్రీను, మల్లేష్, కాకి జగదీష్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY