Ghatkesar: అవుశాపూర్లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు!
Ghatkesar: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అవుశాపూర్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు నివాళులర్పించారు.
Ghatkesar: అవుశాపూర్లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు!
ఘట్కేసర్: భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అవుశాపూర్లో బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగు మచ్చేందర్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ, శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధికి కలాం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు, యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నిరాడంబర జీవనం, క్రమశిక్షణ, పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ అవుశాపూర్ గ్రామ బూత్ అధ్యక్షుడు కాసుల వెంకటేష్గౌడ్, చిలకమారి మహేశ్, మైనారిటీ నాయకుడు షేక్ సలీమ్, నరేశ్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.




