Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు.. జోనల్ కమిషనర్‌కు మాజీ సర్పంచ్ వినతి!
Ghatkesar: ఘట్‌కేసర్ 6వ డివిజన్‌లో మంజూరైన 9 అభివృద్ధి పనుల టెండర్లు, నిధుల విడుదల కోసం మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ జోనల్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు.. జోనల్ కమిషనర్‌కు మాజీ సర్పంచ్ వినతి!
ఘట్ కేసర్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ లో మంజూరైన రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బసాని యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2025 జనవరిలో గత మున్సిపల్ కమిషనర్ రాజేష్ ఆధ్వర్యంలో మొత్తం 9 అభివృద్ధి పనులు మంజూరు చేసినప్పటికీ, వాటికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదని, నిధుల కేటాయింపు జరగలేదని తెలిపారు. ఫలితంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంజూరైన పనుల్లో రైల్వే గేటు గురుకుల్ నుంచి ద్వారకనగర్ వయా గీత మందిర్ వరకు డ్రైనేజ్ నిర్మాణం, కరీంగూడా చౌరస్తా నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, చిన్న చెరువు నుంచి గాంధీనగర్ వరకు డ్రైనేజ్, హిందూ స్మశాన వాటిక–కొండాపూర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో అభివృద్ధి పనులు, ఎదులాబాద్ రోడ్డు పెట్రోల్ బంక్ నుంచి బైపాస్ సర్వీస్ రహదారి వరకు సుమారు 900 మీటర్ల డ్రైనేజ్ పైప్‌లైన్, కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి ఈదమ్మ కాలనీ నర్సరీ వరకు బీటీ రోడ్డు మరియు అంతర్గత డ్రైనేజ్ నిర్మాణం, నారాయణ గార్డెన్ నుంచి కనకదుర్గ ఎదులాబాద్ రోడ్డువరకు సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ పనులను తక్షణమే టెండర్లు పూర్తి చేసి, నిధులు విడుదల చేసి ప్రారంభించాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ సతీష్, మామిళ్ళ మల్లేష్, సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.




