Ghatkesar: మహిళలకు జ్యూట్ బ్యాగ్ శిక్షణ

Ghatkesar: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌ కేసర్ సర్కిల్ పరిధిలోని ఘనపురంలో MSME ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ ముగిసింది.

KARUNAKAR, UPPAL
Published on: 11 July 2026 8:48 AM IST
Ghatkesar
X

Ghatkesar: మహిళలకు జ్యూట్ బ్యాగ్ శిక్షణ

ఘట్‌ కేసర్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌ కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్, ఘనపురంలోని లింగాపురంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 35 మంది మహిళలకు ధ్రువపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ధ్రువపత్రాలు ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో జ్యూట్ బ్యాగ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని మహిళలు ఆదాయ వనరుగా మలుచుకోవాలని అన్నారు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న శిక్షణ, ఆర్థిక సహాయ పథకాలను వినియోగించుకుంటే మహిళలు స్వయం ఉపాధిలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని పేర్కొన్నారు.

మహిళల సాధికారతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కీలకమని, ఇలాంటి శిక్షణల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల మల్లేష్, ఘనపురం మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్,

ఘట్‌కేసర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వరలక్ష్మి, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు పైళ్ల లత జంగారెడ్డి, శిక్షణ ఉపాధ్యాయినులు స్వరూపారాణి, మాధురితో పాటు మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story