Shamshabad: మూసీ తీరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ డ్రోన్ స్ప్రేయింగ్!
Shamshabad: అత్తాపూర్, హైదర్‌గూడ మూసీ పరివాహక ప్రాంతాల్లో 3 డ్రోన్లతో దోమల మందు పిచికారీ చేసిన జీహెచ్‌ఎంసీ. గుర్రపు డెక్క తొలగింపునకు చర్యలు.
Shamshabad: మూసీ తీరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ డ్రోన్ స్ప్రేయింగ్!
Shamshabad: మూసీ పరివాహక ప్రాంతంలో మూడు డ్రోన్లతో ఏకకాలంలో పిచికారి చేసిన జిహెచ్ఎంసి అధికారులు.
అత్తాపూర్, హైదర్‌గూడ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అమర్ సింగ్ మరియు జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ముసినది పరివాహక ప్రాంతమైన రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ హైదర్గూడ ప్రాంతాల్లో మూడు డ్రోన్లను వినియోగించి దోమల నివారణ మందును పిచికారీ చేశారు.
మూసీ నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను కూడా తొలగించేందుకు చర్యలు చేపడతామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి, దశలవారీగా నివారణ చర్యలు చేపడుతున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దోమల బెడదను నియంత్రించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ స్ప్రేయింగ్ చేపట్టడం స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.




